గవర్నమెంట్ స్కూల్ లో బాంబుల కలకలం

636546336635797324బీహార్‌లోని ఓ స్కూల్ లో కలకలం రేగింది. స్కూల్ గేటు ఆవరణలో బాంబులు కన్పించడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.  గయా జిల్లాలోని పరియాలో గవర్నమెంట్ స్కూల్ మెయిన్ గేట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెండు బాంబులు పెట్టారు. ఒకటి టిఫిన్ బాక్సులో అమర్చగా..  ఆ పక్కనే మరో బాంబును పెట్టి ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాంబులను నిర్వీర్యం చేశారు. విద్యార్థులు రాకముందే బాంబులను పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. వీటిని ఎవరు అమర్చి ఉంటారన్నదానిపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. అయితే  బుద్ధగయలోని మహాబోధి ఆలయం దగ్గర రెండు లైవ్ బాంబులను గుర్తించిన రెండు రోజుల్లోనే మళ్లీ అదే తరహా ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Posted in Uncategorized

Latest Updates