గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం : కుమారస్వామి

kumaతమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. ఇది న్యాయవ్యవస్ధ విజయం అని కుమారస్వామి తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రశ్నకు స్పందించిన కుమారస్వామి… రాజ్ భవన్ నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కర్ణాటక రాష్ట్రవ్యాస్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ నేతలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సిద్దరామయ్య, డీకే. శివకుమార్, కుమారస్వామి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. మహిళలు డ్యాన్స్ చేస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ విజయంతో ఉత్తరాఖాండ్ రాజధాని డెహ్రాడూన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates