గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన యడ్యూరప్ప

walaకర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే  సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. తమకు తగినంత మెజారిటీ రాకపోవడంతో… అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందే ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చారు. సభ వాయిదా పడిన తర్వాత యడ్యూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు.  తర్వాత డాలర్స్  కాలనీలోని తన నివాసానికి వెళ్లిపోయారు యడ్యురప్ప.

Posted in Uncategorized

Latest Updates