గవర్నర్ తో కేసీఆర్ భేటీ : ఢిల్లీ టూర్, RTC సమ్మెపై చర్చ

KCR GOVERNORముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (జూన్-8) రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. గవర్నర్ ఐదురోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చాక ముఖ్యమంత్రి తొలిసారి నరసింహన్ తో సమావేశం అయ్యారు. ఐదురోజుల టూర్ లో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ చేశారు. ఢిల్లీలో గవర్నర్ జరిపిన మంతనాలు, కేంద్రం స్పందనపై కేసీఆర్ వివరాలు అడిగి తెల్సుకుంటున్నట్టు సమాచారం.

ఏపీ భవన్ ను తెలంగాణకు కేటాయించే అంశంపైనా కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. నిజాం ఆస్తి అయిన ఏపీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా కోరడంపైనా డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీసు అంశంపైనా గవర్నర్ నరసింహన్ తో .. సీఎం కేసీఆర్ చర్చించే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates