గవర్నర్ తో లక్ష్మీనారాయణ : ప్రధానిని దూషిస్తున్నవారిపై చర్యలు తీసుకోండి

BJPఏపీలో  అధికారంలో  ఉన్న టీడీపీ  మంత్రులు,  నేతలు  ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని  మండిపడ్డారు  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ. ప్రధానమంత్రిని  ఇష్టానుసారంగా  దూషిస్తున్న  వారిపై  చర్యలు  తీసుకోవాలంటూ గురువారం (జూన్-7) హైదరాబాద్ లో గవర్నర్ ను  కలిసి ఫిర్యాదు  చేశారు. మంత్రి  అఖిలప్రియ,  ప్లానింగ్ కమిషనర్  కుటుంబరావు… బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని  అన్నారు. వెంటనే  వారిని  బర్తరఫ్ చేయాలన్నారు.

2019 ఎన్నికల్లో గెలవదని భావించే టీడీపీ నేతలు, మంత్రులు ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ డబ్బుతో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం చంద్రబాబు నాయుడు ఎదుట సంస్కార హీనులుగా, హీనమైన భాషను ప్రధాని మీద వాడటం మంచిది కాదన్నారు. ప్రధానిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అఖిలప్రియను బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ ను కోరినట్లు ఆయన వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates