గవర్నర్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ పథకాలు, ఇతర రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఆ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ప్రారంభించనున్నారు. గవర్నర్ ను కూడా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ప్రారంభించాలని సీఎం కోరినట్లు తెలిసింది. ఇక ఆగస్టు 14 అర్థరాత్రి నుంచి మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు ఇవ్వనుంది ప్రభుత్వం. భగీరథ పథకంపైనా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది . పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం, పరిపూర్ణానంద బహిష్కరణ, ఇతర రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates