గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (జూలై-15)..రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోటాపై హైకోర్ట్ తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్లే విషయంతో పాటు…ఇతర రాజకీయ అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నాలుగో విడత హరితహారం, బీసీ స్వయం ఉపాధి పథకాలపై కూడా ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. సంచార జాతులను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదనలను కూడా గవర్నర్ కు చెప్పినట్లు తెలిసింది. 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల అంశం కూడా గవర్నర్, సీఎం భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

Posted in Uncategorized

Latest Updates