గవర్నర్ దంపతులను పెళ్లికి ఆహ్వానించిన ఆమ్రపాలి

amraవరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి ఈ నెల 18న IPS ఆఫీసర్ సమీర్‌ శర్మతో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సమీర్‌ శర్మ సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్‌ వేదిక కానుంది. ఈ వేడుకకు రావాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌‌ దంపతులను ఆదివారం (ఫిబ్రవరి-11) ఆమ్రపాలి ఆహ్వానించారు. 15నిమిషాలపాటు రాజ్‌‌భవ‌న్‌‌లో ఆమె ఉన్నారు. వివాహం అనంతరం నూతన వధూవరులుగా ఆమ్రపాలి-సమీర్‌ తమ వివాహ విందును 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే విందుకు ఆహ్వాన పత్రికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. హైదరాబాద్ లో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates