గవర్నర్ దంపతులు: మెట్రోజర్నీ బాగుంది

రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు ఆదివారం(జూలై-15) ప్రయాణికులందరితో కలిసి అతి సామాన్యంగా మెట్రో రైలులో ప్రయాణించారు. ముందస్తు సమాచారం లేకుండా సాయంత్రం 5:30 నిమిషాలకు బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌కు వచ్చిన నరసింహన్‌ దంపతులు టికెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి అమీర్‌పేట్‌ జంక్షన్‌లో దిగారు. అక్కడినుంచి మియాపూర్‌కు కనెక్టింగ్‌ ట్రైన్‌లో బయల్దేరారు. మెట్రో రైలులో గవర్నర్ ను చూసిన ప్రయాణికులతో పాటు మెట్రో సిబ్బంది ఆశ్చర్య పోయారు.

కూకట్‌పల్లిలో అప్పటికే ఇన్‌స్పెక్షన్‌ చేస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌(HMRL) ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డికి సమాచారం చేరడంతో ఆయన వెంటనే మియాపూర్‌కు చేరుకుని గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికారు. మియాపూర్‌ జంక్షన్‌లో ప్రయాణికుల కోసం కల్పించిన సౌకర్యాలను నరసింహన్‌ దంపతులకు వసతులను చూపారు.

మెట్రో సదుపాయాలపై గవర్నర్‌ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. HMRL MD ఎన్‌వీఎస్‌ రెడ్డిలతో పాటు స్టాఫ్‌ను అభినందించారు. మాస్కోలోని మెట్రో తరహాలో ఆర్ట్‌ మ్యూజియంలను కూడా మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత మియాపూర్ లో మెట్రో ఎక్కి అమీర్ పేటలో దిగి… అక్కడి నుంచి మరో మెట్రో రైలులో బేగంపేటకు చేరకున్నారు గవర్నర్ దంపతులు.

Posted in Uncategorized

Latest Updates