గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం కలిశారు. అసెంబ్లీ రద్దు తర్వాత రెండోసారి గవర్నర్ ను కలిశారు సీఎం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పాలన ఇతర అంశాలపై ఇద్దరు చర్చించినట్టు సమాచారం.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సన్నాహకాలపైనా గవర్నర్ తో సీఎం మాట్లాడినట్టు సమాచారం. ఇటీవల పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీ ఓ రిపోర్టును సీఈసీకి అందించింది. రాష్ట్రంలోని ఓటర్ లిస్టుపై అభ్యంతరాల స్వీకరణకు నిన్నటి(సెప్టెంబర్ 25)తో గడువు ముగిసింది. ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు వేసేవరకు ఎవరైనా ఓటర్ నమోదుచేసుకోవచ్చని స్టేట్ ఈసీ ప్రకటించింది. ఇంకొద్దిరోజుల్లోనే మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. ఈ మొత్తం పరిణామాలపై కేసీఆర్ .. గవర్నర్ తో చర్చించిన్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates