గవర్నర్ ల వ్యవస్ధ దేశంలో కీలక పాత్ర పోషించింది : మోడీ

hpగవర్నర్ల వ్యవస్థ దేశంలో అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రపతి భవన్ లో మొదలైన 2 రోజుల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో పాటు మోడీ పాల్గొన్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధిలా పనిచేయడంతో పాటు… ప్రజలకు అందుబాటులో ఉండాలని గవర్నర్లకు సూచించారు రాష్ట్రపతి, ప్రధాని

సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమైందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. 49వ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్లు మార్గదర్శిలా, నిర్దేశకుడిగా పనిచేయాలన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా… పనిచేయాలన్నారు. దేశ అభివృద్ధి యాత్రలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలన్నారు. దేశంలోని యూనివర్సిటీల్లో 69శాతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. వాటన్నింటికి ఛాన్స్ లర్లుగా ఉన్న గవర్నర్లు… విద్యార్థులు, సంస్థల్లో ప్రేరణ కలిగించాలన్నారు రాష్ట్రపతి. వర్సిటీల్లో స్టూడెంట్స్ అడ్మిషన్లు, ప్రొఫెసర్ల నియామకాలు పారదర్శకంగా, ఇన్ టైమ్ లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా… నిర్వహించాల్సిన కార్యక్రమాలపై గవర్నర్లకు సూచనలు చేశారు రాష్ట్రపతి. కాన్ఫరెన్స్ లో మొదటి సెషన్ మొత్తం గాంధీ 150వ జయంతి ఉత్సవాలపైనే చర్చించారు.

రాష్ట్రపతి తర్వాత  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కిందిస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా పనిచేయాలని గవర్నర్లను కోరారు మోడీ. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా… యూనివర్సిటీల్లో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, యోగాపై విద్యార్థుల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మధ్యే కొత్తగా విద్యుత్ అందిన గ్రామాల్లో పర్యటించాలని గవర్నర్లను కోరారు. వచ్చే ఏడాది జరిగే 50వ గవర్నర్ల కాన్ఫరెన్స్ కు ఇప్పట్నుంచే సిద్ధం కావాలన్నారు మోడీ.

రాష్ట్రపతి భవన్ లో ఈ ఉదయం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 49వ కాన్ఫరెన్స్ మొదలైంది. అన్ని రాష్ట్రాల గవర్నర్లతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లు పాల్గొన్నారు. రేపు కూడా కాన్ఫరెన్స్ కొనసాగనుంది.

Posted in Uncategorized

Latest Updates