గాంధీ జయంతి స్పెషల్: రైళ్లలో కోరిన ఆహారం మీ సొంతం


మహాత్మాగాంధీ 150వ జయంతి సంధర్భంగా ఇవాళ(అక్టోబర్-2) రైళ్ళలో ప్రయాణికులకు కోరిన ఆహారం లభించనుంది. శాఖాహార భోజనంతో పాటు కావాలనుకున్న వారికి మాంసాహార భోజనమూ సరఫరా చేయనుంది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వే కేటరింగ్  అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కి రైల్వేబోర్డు సమాచారం పంపింది. 2018, 2019, 2020 సంవత్సరాల్లో అక్టోబర్‌ 2న శాఖాహార దినంగా పాటించాలని రైల్వే బోర్డు మొదట నిర్ణయించి… మే నెల్లో అన్ని జోనల్‌ కార్యాలయాలకు నోటీసులు పంపింది.   మరోసారి చర్చించిన తర్వాత అక్టోబర్‌ 2న ప్రయాణికులు కోరిన మాంసాహారం లేదా శాకాహార భోజనాన్ని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇవాళ మహాత్మాగాంధీ వాటర్‌మార్క్‌ ఫొటో ఉన్న రైల్వే టికెట్లను ప్రస్తుతం ప్రయాణికులకు జారీ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates