గాంధీ జ‌యంతి : వృద్ధ ఖైదీల‌కు క్ష‌మాభిక్ష‌

ఈ ఏడాది అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా సగం శిక్షను పూర్తి చేసుకున్న వృద్ధ ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించనుంది. దేశ వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 55 ఏళ్లు దాటిన మహిళా ఖైదీలను, 60 ఏళ్లు దాటిన పురుష ఖైదీలను మూడు విడతల్లో విడుదల చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. వరకట్న హత్యలు, అత్యాచారం, మానవ అక్రమ రవాణా సహాPOTA,UAPA, టాడా, మనీ లాండరింగ్‌, ఫెమా, NDPA, అవినీతి నిరోధక చట్టాల కింద శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ క్షమాభిక్ష వర్తించదు.

ఈ ఏడాది అక్టోబర్‌ 2న కొందరిని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10, వచ్చే ఏడాది అక్టోబర్ 2న మరి కొందరు ఖైదీలను విడుదల చేయనున్నారు. 70 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలవారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు సగం జైలు శిక్ష అనుభవిస్తే వారినీ విడుదల చేయనున్నారు. అంతే కాకుండా కోర్టు విధించిన శిక్షలో మూడింట రెండొంతుల కాలాన్ని పూర్తి చేసుకున్న వారికి కూడా క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. మరణశిక్ష పడినవారు, మరణశిక్ష జీవితఖైదుగా మారిన ఖైదీలకు ఈ ప్రత్యేక ఊరట లభించదు. ఈ మేరకు అర్హత కలిగిన ఖైదీల లిస్టును సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

 

Posted in Uncategorized

Latest Updates