గాంధీజీ మార్గం ఆదర్శంగా నిలుస్తుంది : కేసీఆర్

రేపు (అక్టోబర్-2) మహాత్మాగాంధీ 150వ జయంతి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ మహాత్మాగాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. శాంతియుత పోరాట పంథా ద్వారా హక్కులు సాధించుకునే మార్గాన్ని బోధించిన మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు అని తెలిపారు కేసీఆర్.

ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. గాంధీ మార్గం ఎప్పటికైనా ఆచరణీయం, ఆదర్శ మార్గంగా నిలుస్తుందన్నారు కేసీఆర్.

 

 

Posted in Uncategorized

Latest Updates