గాడ్జిల్లా మళ్లీ పుట్టింది

Florida-Gaint-aligator-Golfరాక్షస బల్లుల జాతికి చెందిన గాడ్జిలా గురించి హాలీవుడ్‌ చిత్రాల్లో చూసుంటారు. అయితే అదే సైజులో కాకున్నా, కొంచెం అలాగే ఉన్న ఓ మొసలి ఒకటి గోల్ఫ్‌ కోర్టులో చక్కర్లు కొట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతుంది.
అమెరికాలోని ఫ్లోరిడాలోని పోప్‌ గోల్ఫ్‌ మైదానంలో కొన్ని రోజుల క్రితం బఫెల్లో క్రీక్‌ గోల్ఫ్‌ కోర్స్‌ పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 14న గేమ్‌ ప్రారంభానికి ముందు అక్కడే ఓ కొలనులో ఉన్న భారీ మొసలి ఒకటి హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మైదానంలో పని చేసే వ్యక్తి తన మొబైల్‌ తో వీడియో తీశాడు.
25 ఏళ్ల క్రితం ఓ మొసలి ఇదే ప్రాంతంలో కనిపించిందని.. బహుశా ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని గేమ్ నిర్వాహకులు తెలిపారు. 2016లో కూడా ఇది ఓసారి కనిపించగా.. దానికి ‘చబ్స్‌’ అని పేరు పెట్టినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఈ వీడియోతో మైదానంలో అడుగుపెట్టేందుకు వెనకాడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates