గానకోకిలకు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం అవార్డు

balu-janakiప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మాణం తన పుట్టిన(జూన్-4) రోజు సందర్భంగా ఇచ్చే జాతీయ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ గాయని ఎస్ జానకికి అందజేయనున్నారు. శ్రీ విజేత ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానకమ్మ ఆశీస్సులతోనే ఇంత పెద్ద గాయకుడిని అయ్యా. ఆమెను సత్కరించుకనే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు బాలు.

దాదాపు 65 సంవత్సరాల పాటు ఎన్నో అద‍్భుత గీతాలతో ప్రేక్షకులను అలరించిన గాన కోకిల జానకీ 17 భాషల్లో దాదాపు 45 వేల పాటలు పాడారు. ఇందులో జపనీస్‌, జర్మన్‌ లాంటి విదేశీ భాషలు కూడా ఉన్నాయి.మొదటి సారి 1952లో దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ తో కలిసి మైసూరు నుంచే పాటలను పాడి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు జానకి . నేపధ్యగాయనిగా ఎన్నో పాటలతో అలరించిన జానకమ్మ ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, 31 సార్లు వివిధ రాష్ట్రాల పురస్కారాలు అందుకున్నారు.  2016లో జానకి రిటైర్మెంట్‌ ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates