గారడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్

ఢిల్లీ : వినూత్న వేషధారణలతో నిరసనలు వ్యక్తం చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ మరో అవతారం ఎత్తారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఇవాళ డిసెంబర్-13న పార్లమెంట్‌ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ శివప్రసాద్‌ కొత్త వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. ‘గారడి’ వేషధారణలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు ఒకడైతే..మోడీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేస్తారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates