గాలి ముద్దు కృష్ణమ నాయుడు కన్నుమూత

gali-muddukrishan-654టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం (ఫిబ్రవరి-6) అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆయన చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. తిరుపతిలోని రామచంద్రాపురంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలో జన్మించారు ముద్దు కృష్ణమ నాయుడు. రాజకీయాలకు ముందు గుంటూరు జిల్లా పెదనంది పాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్ గా పని చేశారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు, నగరి నియోజకవర్గాల నుంచి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.  ముద్దుకృష్ణమ నాయుడు మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates