గాల్వాన్‌ వ్యాలీలో టీ–90 ట్యాంక్‌లను ఉంచిన ఆర్మీ

న్యూఢిల్లీ: చైనాతో శాంతి చర్చలు జరుపుతున్న మన దేశం అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌ లడాఖ్‌లో మన ఆర్మీ ఆరు టీ – 90 మిస్సైళ్లను ఉంచింది. గాల్వాన్‌ వ్యాలీలో ఫైరింగ్‌ ట్యాంక్స్‌, టాప్‌ ఆఫ్‌ ది లైన్‌ షోల్డర్‌‌ ఫైర్డ్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌ను కూడా రెడీగా ఉంచింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) బోర్డర్‌‌లో సాయుధ సిబ్బందిని, ట్రూప్‌ టెంట్స్‌ను తరలిస్తుందని అందుకే మన వాళ్లు కూడా వాటిని మోహరించారని అన్నారు. తూర్పు లడాఖ్‌లోని 1597 కిలోమీటర్లు పొడవైన ఎల్ఏసీ వెంట పోరాట వాహనాలను మోమరించారు. స్ఫాంగూర్‌‌ గ్యాప్‌ ద్వారా విరోధి దూకుడు ప్రణాళికలను తిప్పికొట్టేందుకు చుఫుల్‌ సెక్టార్‌‌లో రెండుఉ ట్యాంక్‌ రెజిమెంట్లను ఉంచారు. చైనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.

Latest Updates