గిట్టుబాటు ధర లేకుంటే రైతులు వ్యవసాయం మానేస్తారు : వెంకయ్య

venkyపంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే… రైతులు వ్యవసాయం మానేస్తారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. భారత దేశం ఒకప్పుడు ఆహార కొరత ఎదుర్కొందని… ఇప్పుడు సర్ ప్లస్ అవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌ఎం డిప్యూటీ డైరెక్టర్ అలగు సుందరం, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, బ్యాంకర్లు , ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates