గిన్నిస్‌ రికార్డ్ : గాంధీజీ గెటప్స్ లో 5,149 మంది విద్యార్థులు

నల్గొండ : భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించి, గాంధీజీని స్మరించుకున్నారు. గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని నల్గొండలో చిన్నారులు మహాత్ముని వేషధారణతో ఆకట్టుకున్నారు. నల్గొండ జిల్లాలోని పలు స్కూల్స్ కి చెందిన 5 వేల149 మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌, గ్లోబల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచెకట్టు, కళ్లజోడు, చేతికర్రతో విద్యార్థులు అలరించారు. అత్యధిక సంఖ్యలో గాంధీ వేషధారణతో ఆకట్టుకున్న ఈ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు బద్దలుకొట్టింది. గతంలో బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో 4 వేల605 మంది పాల్గొన్నారని, దాన్ని బ్రేక్ చేసి.. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పామని తెలిపారు నిర్వాహకులు.

Posted in Uncategorized

Latest Updates