గిన్నిస్ రికార్డు: 49 పిల్లలకు జన్మనిచ్చిన శునకం


ఓ శునకం గిన్నిస్ రికార్డును సృష్టించింది. ఏకంగా 49 పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఈ కుక్క నుంచే క్లోనింగ్ ద్వారా పిల్లలను సైంటిస్టులు సృష్టించారు. మిరాకిల్ మిల్లీ అనే కుక్క గతంలోనే అత్యంత తక్కువ ఎత్తున్న కుక్క పిల్లగా 2012 లోనే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం మరోసారి ఆ రికార్డును కౌవసం చేసుకుంది. దక్షిణ కొరియాలోని సియోల్ కు చెందిన సూవమ్ బయోటెక్ రిసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సృష్టించారు.

2017 ఆగస్టులో మిరాకిల్ మిల్లీ నుంచి క్లోనింగ్ ద్వారా పిల్లలను సృష్టించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 49 పిల్లలను సృష్టిచారు. 50 ఏళ్ల క్రితం డాలీ అనే గొర్రెపిల్లను తయారు చేసేందుకు వినియోగించిన టెక్నాలజీ ద్వారానే ఈ బుజ్జి కుక్క పిల్లలను సృష్టించారు. మిరాకిల్ మిల్లీలానే 37 పిల్లలు ఉండగా…మిగిలినవి మాత్రం కొంచెం ఎత్తుగా ఉన్నాయట.

 

Posted in Uncategorized

Latest Updates