గిన్నిస్ రికార్డ్.. అరటిపండు నుంచి DNA వేరుచేశారు

ఉత్తరప్రదేశ్: లక్నోలోని జీడీ గోయెంకా స్కూల్  విద్యార్థులు  అరటి పండు నుంచి డీఎన్ఏ వేరు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఈ స్కూల్ కు చెందిన 550 మంది  విద్యార్థులు ఒకేసారి ఈ ప్రయోగం చేశారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రయోగం ఎలా చేయాలో స్లైడ్స్ ద్వారా చెప్పారు.

దీంతో వారు ఈ ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశారు.  గతంలో అమెరికాకు చెందిన 302 మంది విద్యార్థులు ఇదే ప్రయోగాన్ని చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను లక్నో విద్యార్ధులు బ్రేక్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates