గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో మన కిచిడీ

నాగ్‌ పూర్: కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పడంలో భాగంగా నాగ్‌ పూర్‌ కు చెందిన విష్ణు మనోహర్ అనే వ్యక్తి 3 వేల కిలోల కిచిడీని తయారు చేశాడు. రేపు (అక్టోబర్ -16)న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా  ఈ వినూత్న ప్రయత్నం చేశాడు. ఫలితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్న మన కిచిడీని.. జాతీయ వంటకంగా గుర్తించాలనీ డిమాండ్ చేశాడు విష్ణు. కిచిడీని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తింటారని, అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపాడు మనోహర్.

భారీ స్థాయిలో చేసిన ఈ కిచిడీ కోసం 275 కిలోల బియ్యం, 125 కిలోల పెసర పప్పు, 150 కిలోల శనగ పప్పు, 3 వేల లీటర్ల నీళ్లు, 150 కిలోల నెయ్యి వాడారు. ఈ గిన్నిస్ ఈవెంట్‌ లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ ను ఆయన అభినందించారు. గతేడాది నవంబర్‌ లో న్యూఢిల్లీలో జరిగిన ఈవెంట్‌ లో 918 కిలోల కిచిడీ తయారు చేసి, ఇండియా గిన్నిస్ బుక్‌ లోకి ఎక్కింది. అప్పట్లో ఆ కిచిడీని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తయారు చేశాడు.

Posted in Uncategorized

Latest Updates