గిన్నీస్ రికార్డు: వయస్సు 12..ఎత్తు 6 అడుగులు

hightవయస్సుతో పాటు ఎత్తు పెరుగుతుంటాము. కొందరు ఏజ్ తగ్గట్టుగా హైట్ ఉంటే…మరికొందరు చిన్నగా ఉంటారు. కానీ ఓ అమ్మాయి మాత్రం ఊహించని విధంగా 6 అడుగుల 2 ఇంచులు పెరిగింది. ఇంతకీ ఆ అమ్మాయి వయసు ఎంతో తెలుసా…కేవలం 12 ఏళ్లు మాత్రమే. ఇంగ్లాండ్ లోని సౌతంప్టన్‌కు చెందిన 12 ఏళ్ల సోఫీ ఇప్పటికే 6 అడుగుల 2 ఇంచులు ఎత్తుపెరిగి గిన్నిస్ రికార్డు సాధించింది.

అయితే చాలామందికి ఎత్తు పెరగడం వరమైతే.. సోఫీకి శాపంగా మారింది. రోజురోజుకూ ఎత్తు పెరుగుతూ పోతుండటంతో స్కూల్‌లో తనను అంతా జిరాఫీ అంటూ ఆటపట్టించడం, ఇంట్లో సీలింగ్ తగలడం, బయటకు వెళ్తే అందరూ వింతగా చూస్తుండటంతో ఎత్తు పెరగకుండా ఉండటానికి ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదట.

హైట్ కారణంగా ఎన్నో రికార్డులు ఆమె సొంతం అయ్యాయి. అయితే ఇప్పటికైనా తన పెరుగుదల ఆగిపోతే చాలు అని అంటుంది సోఫీ. సోఫీ పుట్టిన తర్వాత 8 నెలలకు తనకు మర్ఫాన్ సిండ్రోమ్ ఉందని తెలిసింది. అదో జెనెటిక్ డిజార్డర్. అప్పటి నుంచి అసాధారణంగా సోఫీ పెరగడం ప్రారంభించిందట. 3000 మందిలో ఒకరికి ఈ సిండ్రోమ్ ఉంటుందని డాక్టర్లు తెలిపారు. అంతే కాదు.. భవిష్యత్తులో సోఫీ ఇంకా ఎత్తు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates