గిఫ్ట్ ప్యాక్ లో బాంబ్ : పెళ్లి కొడుకు మృతి

GIFT-PACK-Bombరాంగోపాల్ వర్మ క్రైం సినిమాల్లోనూ ఇలాంటి స్కెచ్ లేదు. ఇలా కూడా చంపుతారని ఎవరూ ఊహించలేదు. గిఫ్ట్ రూపంలో ఇచ్చిన బాక్స్ లో బాంబు పెట్టి మరీ పెళ్లి కొడుకును చంపేశారు దుండగులు. ఈ షాకింగ్ ఘటన ఒరిస్సా రాష్ట్రం.. బోలన్ గిరి జిల్లా పట్నఘర్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

సోమశేఖర్ – రీనా పెళ్లి ఫిబ్రవరి 18వ తేదీ జరిగింది. 21వ తేదీ సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు. వచ్చిన వారు గిఫ్ట్ లు కూడా ఇచ్చారు. ఆ రాతంత్రా హ్యాపీగా సాగింది. 23వ తేదీ ఉదయం ఇంట్లో వచ్చిన గిఫ్ట్ ప్యాక్ లను ఓపెన్ చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. పెళ్లి కుమారుడు సోమశేఖర్ ఓ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అది పేలింది. అందులో బాంబ్ పెట్టారు. ఓపెన్ చేయగానే పేలిపోయే విధంగా అమర్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. గిఫ్ట్ బాంబ్ పేలుడుతో పెళ్లి కుమారుడు సోమశేఖర్, అతని నానమ్మ జమామొన్నీసా చనిపోయింది. పెళ్లి కూతురు రీనా తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. గిఫ్ట్ బాంబ్ ఇచ్చింది ఎవరు.. ఎందుకు ఇలా చేశారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. రిసెప్షన్ వీడియో పరిశీలిస్తున్నారు. సోమశేఖర్ తరపు వారు ఇలా చేశారా లేక రీనా తరపు శత్రువులు టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది.

Posted in Uncategorized

Latest Updates