గిరిజన మహిళల ఆగ్రహం… ఉత్తమ్‌ దిష్టిబొమ్మ దగ్ధం


అశ్వాపురం : బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత చీరెల పంపిణీ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన మహిళలు. అశ్వాపురం జడ్పీటీసీ తొకల లత ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అన్ని గ్రామాల మహిళలు మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం యథావిధిగా జరగాల్సి ఉండగా కాంగ్రెస్‌తో సహా విపక్ష పార్టీలు దురుద్దేశంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చీరెల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడిందని ముక్తకంఠంతో విమర్శించారు ఆందోళనకారులు.

Posted in Uncategorized

Latest Updates