గిరిబాల రక్ష : హాస్టల్‌ స్టూడెంట్స్ కు ఆరోగ్యం


తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఉండే స్టూడెంట్స్‌కు సడన్‌గా అనారోగ్య సమస్యలు వస్తే సకాలంలో వైద్యం అందడం కష్టంగా మారుతోంది. ఒక్కోసారి ప్రాణాల మీదకూ వస్తోంది. తల్లిదండ్రులకు సమాచారం చేస్తే వారొచ్చి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘గిరి బాల రక్ష స్కూల్‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాం’ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది జులైలో ప్రారంభమైన ఈ స్కీంకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీన్ని మెరుగ్గా అమలు చేయడానికి ప్రభుత్వం ‘కాల్‌ హెల్త్‌‌‌‌‌‌‌‌’ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో హెల్త్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్‌ స్టూడెంట్స్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ట్రైబల్‌ వెల్పేర్‌ శాఖ పరిధిలో 321 ఆశ్రమ పాఠశాలలు, 147 హాస్టళ్లలో1,16,577 మంది స్టూడెంట్స్‌ చదువుతున్నారు. ఆశ్రమ పాఠశాలల కాంపౌండ్‌లోనే స్కూళ్లు ఉండగా, హాస్టళలో ఉంటున్న విద్యార్థులు సమీపంలోని గవర్నమెంట్‌ స్కూళకు వెళ్తారు. అధికారులు వీరందరి బ్లడ్‌ గ్రూప్‌, ఆరోగ్యస్థితిని ఇప్పటికే సేకరించారు. అన్నిఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించారు. వీరు అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను గుర్తించి పరీక్షలు చేస్తారు. ఆ రిపోర్టులను కమాండ్‌ సెంటర్‌కు పంపిస్తారు. ఇక్కడ రెండు షిఫ్టుల్లో ఇద్దరు క్వాలిఫైడ్‌ డాక్టర్లు డ్యూటీలో ఉండి వాటిని పరిశీలించి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ కోసం సూచనలు చేస్తారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఇక్కడి నుంచే సమీక్షిస్తూ మార్పు రాకుంటే అంబులెన్స్‌ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు తరలిస్తారు. విద్యార్థిని హైదరాబాద్‌ కు తీసుకువచ్చేలోపే అతడి హెల్త్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్‌ను గిరిజన సంక్షేమ శాఖ సంబంధిత ఆస్పత్రికి పంపిస్తుంది. అతడు వచ్చీరాగానే ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ అందేలా చర్యలు తీసుకుంటారు.

హెల్త్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌ సెంటర్‌ను జూలైలో ప్రారంభించగా వారానికి సగటున ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్‌ను హైదరాబాద్‌ తీసుకువచ్చి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ చేయిస్తున్నారు.ఇప్పటివరకు 60 మంది విద్యార్థులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ అందినట్టు కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి తెలిపారు. నిత్యం ANM పర్యవేక్షణ ఉండడంతో విద్యార్థులకు ఏమాత్రం ఆరోగ్యం సరిగా లేకపోయినా వేగంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ అందుతోంది. ఇందులో ముఖ్యంగా రక్తహీనత, వైరల్‌ ఫీవర్స్‌, విరేచనాలు, ఎలర్జీలతో  విద్యార్థులు ఎక్కువ బాధ పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న మారుమూల గిరిజన ప్రాంత విద్యార్థులకు ఆరోగ్య రక్షణపై సరైన అవగాహన లేదు. పౌష్టికాహారలోపంతో ఎదుగుదల తక్కువ. ఏ మాత్రం వాతావరణం మారినా జబ్బు పడతారు. అలాంటి వారికి ANMలు డాక్టర్ల సలహాలతో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates