గిరిరాజ్ కాంట్రవర్సీ కామెంట్స్ : భారత్ లో బాబర్ వారసులెవరూ లేరు

juhభారతీయ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్. భారత్ లో బాబర్ వారసులెవరూ లేరని.. భారతీయ ముస్లింలు అందరూ రాముడి వారసులే అన్నారు. బాబ్రీ మసీదుని నిర్మించి తీరుతామన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జిన్నా భూతం అసుదుద్దీన్ ఒవైసీని పట్టుకుందని, దేశాన్ని ముక్కలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ అన్నారు. వారంతా మక్కా యాత్రకు వెళ్తారు.. మరి మేము ఎక్కడికి వెళ్లాలి, మా కోసం పాకిస్తాన్‌లో రామమందిరం నిర్మిస్తారా అని గిరిరాజ్ వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ..  తామంతా ఒకటేనని.. భారతీయులందరూ పూజించేది రాముడినే అన్నారు.  ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates