గుంటూరులో దారుణం.. యువకుడిని కత్తులతో వెంటాడి చంపారు

ఏపీ : గుంటూరులో దారుణ సంఘటన జరిగింది. మార్కెట్‌ యార్డు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. బార్‌ దగ్గర ఉన్న యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో వెంటాడి.. వేటాడి దాడి చేశారు. ప్రాణభయంతో అతడు పరుగులు తీస్తుండగా.. అంతా చూస్తుండగానే చంపారు. అయితే.. ఈ దాడులు వ్యక్తిగతమైన కక్షలతోనా, ఆస్తి తగాదాలా.. అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. మృతుడ్ని రేపల్లెకు చెందిన ప్రేమ్‌ కుమార్‌ గా గుర్తించారు. ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates