గుండెలను పిండేసింది : కన్నీటితో కృతజ్ఞతలు చెప్పిన కుక్క

golden-retreverచావుకి దగ్గరగా ఉన్నాం.. మరికాసేపట్లో ప్రాణాలు తీస్తారు.. ఈ లోకంలోనే ఉండం అని తెలిస్తే మనిషి ఎంతలా విలవిలలాడతాడు.. ఏడుపుతో కన్నీళ్లు ఆగవు.. అంతలోనే ఓ శుభవార్త. ప్రాణాలతో బతికి బయటపడ్డాం అంటే అప్పుడు కూడా కన్నీళ్లే. కాకపోతే ఆనంద బాష్పాలు. ఇది మనుషులకే కాదు.. కుక్కలకు కూడా ఇదే విధమైన ఫీలింగ్ ఉంటుందని నిరూపితం అయ్యింది. అవును ఇది పచ్చినిజం. మరొకరి ప్లేట్ లో మాంసం కావటానికి సిద్ధంగా ఉన్న ఓ కుక్కను కాపాడిన తర్వాత.. ఆ కుక్క చూపించిన కన్నీటి కృతజ్ఞత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనాలోని కున్మింగ్స్ జియాబొబాకియా ఏరియాలో మాంసం మార్కెట్ ఉంది. అక్కడ కుక్కల మాంసం విక్రయిస్తారు. ఇటీవల కొందరు కున్మిన్ అనే జంతు ప్రేమికులు మార్కెట్ కు వెళ్లారు. అక్కడ కుక్కలను చంపటాన్ని చూసి సహించలేకపోయారు. మాంసం కావటానికి 20 కుక్కలు రెడీగా ఉన్నాయి. అందులో గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఓ కుక్క వారి కంట పడింది. దాన్ని విడిపించాలని చూశారు. అయితే ఆ మాంసం దుకాణం దారుడు సరేమిరా అన్నాడు. దీంతో చైనా కరెన్సీలో 14వేల రూపాయలు చెల్లించి ఈ  కుక్కను విడిపించారు.

మిగతా కుక్కలను చంపటం అప్పటి వరకు చూసిన ఆ కుక్క.. తర్వాత తన వంతు వస్తుందని తెలిసిందో ఏమో.. బోను నుంచి బయటకు వచ్చిన తర్వాత కన్నీళ్లు కార్చింది. జంతు ప్రేమికుల ఆదరణకు కన్నీళ్లు పెట్టుకుంది అంటూ చైనీస్ మీడియా వెల్లడించింది. ఏదైనా గాయం అయినప్పుడు కుక్కలకు కన్నీళ్లు వస్తాయని.. అయితే ఇక్కడ ఆ కుక్కకు ఎలాంటి గాయం లేదని చెబుతున్నారు. ఇవి కచ్చింతంగా కన్నీటి కృతజ్ఞతలే అంటున్నారు. అవును మరి విశ్వాసానికి ప్రతీకలు కదా కుక్కలు..

Posted in Uncategorized

Latest Updates