గుండెల్లోని ప్రేమ ఇలా : భార్యకు గుడి కట్టిన సిద్ధిపేట వాసి

raja

అనురాగం, ఆత్మీయత, ఆరాధన అంటే ఇదేనేమో.. భార్య చనిపోయింది. ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. అయినా ఆ భర్తకు.. ఆమె జ్ణాపకాలే వెంటాడుతున్నాయి. మర్చిపోలేకపోయాడు. 35 ఏళ్ల జీవితంలో ప్రతి క్షణం భార్య ఆనందం కోసం తపించాడు. పోయిన తర్వాత ఆ జ్ణాపకాలు పదిలంగా ఉండటం కోసం ఏకంగా గుడి కట్టాడు ఆ భర్త. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేటలో జరిగిన ఈ కథ మీ కోసం..

సిద్ధిపేట జిల్లా గోసనపల్లి గ్రామం. చంద్రగౌడ్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి. భార్య రాజమణి. వీరిది అన్యోన్యమైన జీవితం. చంద్రగౌడ్ ఇటీవల పదవీ విరమణ కూడా చేశారు. ఇంటి దగ్గర ఉంటున్నారు. భార్య అంటే ఎంతో ప్రేమ. ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే. ఈ భార్యాభర్తల అన్యోన్యతపై దేవుడికి సైతం ఈర్ష్య వచ్చిందో ఏమో.. ఇటీవలే చంద్రగౌడ్ భార్య రాజమణి అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరి అయ్యారు ఆయన. ఆమె జ్ణాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. తనపై ఉన్న ప్రేమకు ఏదైనా చేయాలని ఆలోచించాడు చంద్రగౌడ్. అనుకున్నదే తడవుగా గుడి కట్టాలని నిర్ణయించాడు. వెంటనే గోసనపల్లి గ్రామంలో భార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. రోజూ ఉదయం, సాయంత్రం భార్యకు ఇష్టమైన వంటకాలు కూడా పెడుతున్నాడు చంద్రగౌడ్. బతికి ఉన్నంత కాలం.. భార్య జ్ణాపకాలతోపాటు.. ఈ గుడే తనకు దైవం అంటున్నాడు. ఎంత ప్రేమ ఉంటే.. ఇలా గుడి కట్టిస్తారు భార్యకు అంటున్నారు. నేటి తరానికి ఇది ఆదర్శం అంటున్నారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates