గుండె పగిలేలా ఏడ్చారు : మూడేళ్ల వయసులో మిస్సింగ్ .. 24 ఏళ్ల తర్వాత వచ్చాడు

chinachild24 సంవత్సరాల క్రితం కొడుకు తప్పి పోయాడు. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. అసలు బతికున్నాడో లేదో తెలియదు. గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండె పగిలేలా ఏడ్చేవారు. కానీ ఏంచేస్తారు 24 సంవత్సరాలు గడిచాయి..ఇక ఆశలు లేవు. అలాంటి సమయంలో ఆ కొడుకు తిరిగివచ్చి.. ఆ తల్లిదండ్రలను ఆశ్చర్యపరిచాడు. దీంతో కొడుకుని గట్టిగా కౌగిలించుకుని పట్టరాని దుంఖంతో కన్నీరుమున్నీరయ్యారు ఆ తల్లిదండ్రులు.

మూడేళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి 24 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్లను కలిశాడు. చైనాలో ఈ ఘటన జరిగింది. 1994, ఆగస్ట్ 8న ఆ వ్యక్తి తప్పిపోయాడు. అప్పటి నుంచి అతని తండ్రి లి షుంజి అతని కోసం వెతుకుతూనే ఉన్నాడు. దేశవ్యాప్తంగా లక్షా 80 వేల మిస్సింగ్ నోటీసులు పంపించాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత అతని శ్రమ ఫలించింది. ఇప్పుడు 27 ఏళ్ల వయసులో లి లీ అనే ఆ తప్పిపోయిన వ్యక్తి మళ్లీ తన తల్లిదండ్రులను కలిశాడు. పోలీసులు డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా అతన్ని పేరెంట్స్‌తో కలిపారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన డీఎన్‌ఏ డేటాబేస్‌లో లీని పోలీసులు గుర్తించినట్లు మెయిల్ ఆన్‌లైన్ వెల్లడించింది. అతను తప్పిపోయిన సమయంలో ఓ జంట అతన్ని తమ ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు అతని తల్లిదండ్రుల కోసం వెతికారు.

అయినా ఫలితం లేకపోవడంతో ఇక తామే పెంచుకోవాలని నిర్ణయించారు. అటు కొడుకు తప్పిపోయిన బాధలో ఉన్న షుంజి.. తన వ్యాపారాన్ని వదిలేసి అతని కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఇలా దేశం మొత్తం తిరిగాడు. లక్షా 80 వేల మిస్సింగ్ నోటీసులను ప్రింట్ చేయించి దేశమంతా తిరిగి పంచాడు. చివరికి అతని శ్రమ ఫలించి 24 ఏళ్ల తర్వాత ఆ తప్పిపోయిన కొడుకు కనిపించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

 

Posted in Uncategorized

Latest Updates