గూగుల్ ప్లస్ బంద్… హ్యాకైందట

గూగుల్ ప్లస్ ఫ్లాట్ ఫాం ను నిలిపివేస్తున్నట్లు గూగుల్  ఓ ప్రకటనలో తెలిపింది. గూగుల్ ప్లస్ లో బగ్స్ వున్నాయని అందుకే నిలిపివేస్తున్నట్లు సంస్థ అధికారులు చెప్పారు. మరో 90 రోజుల్లో గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గూగుల్ ప్లస్ వాడుతున్న 52.5 మిలియన్ ల యూజర్లకు ఇప్పటికే సమాచారం పంపుతున్నారు.

బగ్స్ తో పాటు  వినియోగదారుల సమాచారం హ్యాకైందని తెలుస్తుంది.  గూగుల్ ప్లస్ యూజర్లకు చెందిన పేర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు, వృత్తి, వయస్సు తో పాటు మరిన్ని వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లి ఉంటాయని గుగుల్ అధికారులు అనుమానిస్తున్నారు. సాఫ్టవేర్ లో ఉన్న లోపం కారణంగానే ఈ పరిస్తితి వచ్చిందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates