గుడ్డుతో గుండె భద్రం

eggsచౌకగా లభించే పౌష్టికాహారంలో గుడ్డు ఒకటి. గుడ్డు తినటం వల్ల ఉపయోగాలు అనేకం. ముఖ్యంగా ఒక గుడ్డు తినటం వల్ల శరీరానికి ఉపయోగపడే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తనాళాలు, గుండె జబ్బులు దరిచేరవు. కంటి సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది. ఒక గుడ్డులో 300 మైక్రోగ్రాముల కొలైన్ లభిస్తుంది. ఇది మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటానికి దోహదం చేస్తోంది. వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్షయ వ్యాధిగ్రస్తులు, బాలింతలు, గర్భిణులు, కాలేయ వ్యాధిగ్రస్తులు రోజూ గుడ్డు తింటే మంచిది. ఒక గుడ్డులోని తెల్లసొనను కప్పు పాలలో కలిపి, దీనికి రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే శరీరంలోని విష పదార్థాలకు విరుగుడు లభిస్తోంది. ఇలా ప్రతిరోజూ తీసుకోవటం వల్ల శారీరక బలం పెరిగి టానిక్ వలే ఉపయోగపడుతుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ నిత్యం కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవాలి. ఎదిగే పిల్లలకు శక్తిని ఇస్తుంది. నేటి కాలంలో కూడా కోడిగుడ్డును తీసుకోనివారు ఉన్నారు. కోడిగుడ్లను విరివిగా తీసుకుందాం. ఆరోగ్యం వుందాం.

కోడిగుడ్డును తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని చైనా శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. గుడ్లు అస్సలు తిననివారితో పోలిస్తే గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల అవకాశం చాల తక్కువ అని వారి ధ్యయనంలో తేలింది. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికి దాంతోపాటే ఆరోగ్యానికి మంచి చేసే విటమిన్లు, రసాయనాలు ఉన్నట్లు వారి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates