గుడ్డు ..ఆడా.. మగా..అనేది ముందే తెలుస్తుందటా

వెలుగు నెట్ వర్క్ : ఈ మధ్య టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. కోళ్ల పెంపకంలోనూ ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కోడి గుడ్డు పొదగకముందే లింగనిర్ధారణ చెయ్యొచ్చు. ఈ టెక్నాలజీ పేరు ‘సెలెగ్ట్‌ ప్రాసెస్‌ ’.. అంటే గుడ్డు దశలోనే అది ఆడా? మగా? అన్నది గుడ్లలో ఉండే హార్మోన్‌ ఆధారంగా గుర్తిస్తారు.

కోళ్ల ఫారాల్లో గుడ్లు పొదిగిన తర్వాత అవి మగవైతే…వాటివల్ల ఆదాయం ఉండదని చంపేస్తుంటారు. అందుకోసం వాళ్లు దారుణమైన పద్ధతులు పాటిస్తున్నారు. కోడిపిల్లలకు ఊపిరాడకుండా చేసి చంపేస్తున్నారు. మరికొందరు సజీవంగా యంత్రాల్లో వేసి ముక్కలు చేసి మొసళ్లకు, పాములకు ఆహారంగా వేస్తున్నారు. ఆ పద్ధతులపై జంతు ప్రేమికులు చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకే జర్మనీకి చెందిన ‘రెవ్వె’ సూపర్‌ మార్కె ట్ కొత్త టెక్నాలజీని డెవలప్‌చేయించింది. ఈ విధానంలో వేరు చేసిన గుడ్లను మార్కెట్‌‌లో ‘సెలెగ్ట్’ పేరుతో అమ్ము తున్నారు. వీటిని పశువుల దాణాలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 600 కోట్ల మగ కోడిపిల్లలను చంపేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates