గుడ్ న్యూస్ : ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు

ratesరైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్ లో కేటాయింపులకు అనుగుణంగా.. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ లో ప్రధాన పంట అయిన వరికి కనీస ధరను క్వింటాకు 200 రూపాయలు పెంచింది. సాధారణ వరి రకం మద్దతు ధర ప్రస్తుతం 1550 రూపాయలుండగా… పెంచిన తర్వాత 1750కి చేరింది. గ్రేడ్ – ఏ రకం వరి కనీస మద్దతు ధర ప్రస్తుతం 1590 రూపాయలుండగా.. కూడా 1750 రూపాయలకు పెంచింది కేంద్రం. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

పెంచిన 14 రకాల పంటల ధరల వివరాలు ఇలా ఉన్నాయి

1.వరి-1,550 నుంచి 1,750 గ్రేడ్ A -1,590 నుంచి1,750

2.పత్తి-4,020 నుంచి 5, 150 గ్రేడ్ A -4,320 నుంచి 5, 450

3.జొన్నలు -1,700 నుంచి 2,430

4.సజ్జ-1,425 నుంచి 1,950

5.రాగులు-1,900 నుంచి 2,897

6.మెత్తులు -1,425 నుంచి 1,700

7.కందులు-5,450 నుంచి 5,675

8.పెసర-5,575 నుంచి 6975

9.మినుములు-5400 నుంచి 5,600

10.వేరుశనగ-4,450 నుంచి 4,890

11.పొద్దు తిరుగుడు-4,100 నుంచి 5,388

12.సోయాబీన్ -3,050 నుంచి 3,399

13.నువ్వులు-5,300 నుంచి6,249

14.బొబ్బెర-4,050 నుంచి 5,877

Posted in Uncategorized

Latest Updates