గుడ్ న్యూస్: తగ్గిన రైల్వే ఛార్జీలు

trainchargesరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు టికెట్ల ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ లాంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయి. ఆహార పదార్థాలపై GST ఛార్జీలను తగ్గించడంతో టిక్కెట్‌ ధరలు కూడా కిందకి దిగొచ్చినట్టు తెలిసింది. సోమవారం(ఏప్రిల్-16) నుంచి రైళ్లు, ప్లాట్‌ఫామ్‌ దగ్గర  అమ్మే ఆహార పదార్థాలు, కూల్ డింక్స్ ల ధరలను ఇండియన్‌ రైల్వేస్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) తగ్గించింది. దీంతో మీల్స్‌ ధరలు కలిసి ఉండే ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు కూడా తగ్గాయి. GST రేటును తగ్గించడంతోనే ఆహార పదార్థాల ధరలు తగ్గించామని  తెలిపింది IRCTC.

రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌ల దగ్గర, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అమ్మే ఫుడ్ ఐటమ్స్, డ్రింకులన్నింటిపై కూడా ఒకేవిధమైన GST రేటు 5 శాతాన్ని విధించాలని తెలిపింది. అంతకముందు ఈ రేటు 18 శాతంగా ఉండేది. ఈ రేటును 18 శాతం నుంచి 5 శాతం తగ్గించడంతో, ప్రీమియం రైళ్ల టిక్కెట్‌ ధరలు ఒక్కో టిక్కెట్‌పై రూ.40 నుంచి రూ.60 వరకు తగ్గాయి. రైల్వే లైసెన్సులతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్రంగా ఎఫెక్ట్ చూపించే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates