గుడ్ న్యూస్ : పోలీస్ ఉద్యోగాల్లో వయసు సడలింపు

POLICE AGE LIMITపోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకుంది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. మూడేళ్ల వయో పరిమితి పెంచుతూ గురువారం (జూన్-7) ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ డిపార్ట్ మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ తో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. నోటిఫికేషన్ ప్రకారం 88, 89, 90, 91 కేటగిరీ పోస్టులకు మూడేళ్ల వయోపరిమితిని పెంచుతూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే 18వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన వినతితో.. మూడేళ్ల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Posted in Uncategorized

Latest Updates