గురి తప్పలేదు : షూటింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్

gold medalజూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ మరో స్వర్ణం గెలిచింది. సిడ్నీలో జరిగిన టోర్నీలో పురుషుల 25మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్ ఈవెంట్‌ లో ఈ ఘనత సాధించింది ఇండియా. 15 ఏళ్ల అనిశ్‌ భన్‌వాలా గోల్డ్ మెడల్ సాధించాడు.

మరో ఇద్దరు ఆటగాళ్లు అన్‌హాద్‌ జవాండ, రాజ్‌కన్వార్‌ సింగ్‌ కూడా నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు. రెండు, మూడు స్థానాల్లో మాత్రం చైనా ఆటగాళ్లు సిల్వర్, బ్రాంజ్ మెడల్ గెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం భారత్‌కు చెందిన మను బాకర్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates