గురుకులాల్లో 281 జేఎల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

గురుకుల జూనియర్ కాలేజీల్లో 281 జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు(TREIRB) నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 8వరకు ఆన్ లైన్లో  దరఖాస్తులు స్వీకరించనుంది.JL నియామాలకు సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. ఈ మూడు పేపర్లలో ఎంపికైన అభ్యర్థికి డెమో టెస్ట్ ఉంటుంది.

 

సొసైటీల వారీగా జేఎల్ పోస్టులు:

ఎస్సీ సొసైటీ: 149

ఎస్టీ సొసైటీ: 40

మైనార్టీ సొసైటీ:89

సాధారణ సొసైటీ: 3

Posted in Uncategorized

Latest Updates