గురుకుల్ నోటిఫికేషన్ రిలీజ్: ఏప్రిల్ 8న ప్రవేశ పరీక్ష

guru
SC,ST,BC గురుకుల స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశాలకు గురుకుల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2018ను ప్రభుత్వం నిర్వహించనుంది. అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనుంది. దీని కోసం ప్రభుత్వం టీజీ గురుకుల్‌ సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించింది.

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 01.09.2018 వరకు 9 నుంచి 11 ఉండాలి. SC,ST విద్యార్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లో ప్రస్తుతం 4వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా ఉండాలి. http:/tgcet. cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అన్ లైన్లో రూ.50 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు 19 నుంచి మార్చి 16 దాకా కొనసాగుతాయనిTSWREIS కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. టీజీ గురుకుల్‌ సెట్‌ పరీక్ష ఏప్రిల్‌ 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates