గురుకుల ఉద్యోగాలన్నీ అక్టోబరునాటికి భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కొత్తగా మంజూరు చేసిన 5318 ఉద్యోగాల భర్తీ అక్టోబరు నాటికి పూర్తిచేస్తామన్నారు గురుకుల నియామక బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్. ఇప్పటికే 960 టీజీటీ, 1972 పీజీటీ, 281 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు ప్రకటనలు జారీ చేశామని చెప్పారు. యూజీసీ నెట్ ఫలితాలు వెల్లడైనందున రెండు, మూడు రోజుల్లో 460 పోస్టులతో కూడిన డిగ్రీ అధ్యాపకుల నియామక ప్రకటన వస్తుందని వెల్లడించారు డాక్టర్ ప్రవీణ్‌కుమార్.

Posted in Uncategorized

Latest Updates