గుర్రపుడెక్క తొలగింపు పనులు ప్రైవేట్ ఏజెన్సీలకు

gooparuహైదరాబాద్ సిటీ చెరువుల్లో పెరుగుతున్న గుర్రపుడెక్క బల్దియా అధికారుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.  దీంతో దోమలు పెరిగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గుర్రపు డెక్కను శాశ్వతంగా తొలగించడంపై దృష్టిపెట్టింది GHMC. ఈ పనిని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది.

నగరంలోని చెరువుల్లో గుర్రపు డెక్క రోజు రోజుకు పెరుగుతోంది. చాలా చెరువుల్లో గుర్ర పుడెక్క ఉండటంతో చుట్టూ పక్కల కాలనీల్లోని జనం దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతోంది. దీంతో బల్దియా అధికారులు చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను శాశ్వతంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే GHMC లేక్స్, ఎంటమాలజీ విభాగాలు చెరువులు, కుంటల్లో పేరుకున్న గుర్రపుడెక్కను తొలగించే పనులు చేపట్టాయి.  ఐదు ఎకరాలకన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్న కుంటల్లో ఎంటమాలజీ విభాగం, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుల్లో GHMC లేక్స్ విభాగం గుర్రపుడెక్కను తొలగించాలని నిర్ణ యించారు. ఇప్పటికే ఎంటామాలజీ సిబ్బంది 16 చెర్వుల్లో తొలగిస్తే.. లేక్స్ విభాగం మరో 29 చెర్వుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టింది.

అధికారులు గుర్రపుడెక్క తొలగిస్తున్నా మళ్లీ కొద్ది రోజులకే పెరుగుతోంది. దీంతో ఈ తొలగింపు పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. ఫస్ట్ ఫేజ్ కింద 10 కోట్లతో 36 చెరువులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనున్నారు. దాదాపు 612 ఎకరాల్లో విస్తరించి ఉన్న 36 చెరువుల్లో గుర్రపుడెక్క  తొలగించడంతో పాటు వాటిని మూడేండ్ల పాటు నిర్వహణ కూడా ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది ghmc. అదికూడా ఒకే సంస్థకు అప్పగించాలని GHMC స్లాడింగ్ కమిటీ నిర్ణయించింది. తొలగించిన గుర్రపుడెక్కను చెరువుకు కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో వేయడం గానీ, నిర్థారిత స్థలంలో వేయడం లేదా ఎరువుల తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టనున్నారు.

సిటీలోని చెరువులను అందంగా తీర్చిదిద్దడానికి బల్దియా ప్రయత్నిస్తోంది. గుర్రపుడెక్కను శాశ్వతంగా తీసేసి చెరువులను కాపాడే విధంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates