గులేరు గురితప్పిందా…ఉద్యోగం ఊస్ట్

ఉద్యోగానికి ముందు టెస్టులు పెడతారు. అన్ని పరీక్షల్లో ఒకే అయితేనే ఉద్యోగం ఇస్తారు. అయితే ఇక్కడ మాత్రం  విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు టెస్టులు పెడుతున్నారు. ఆ టెస్టుల్లో పాస్ అయితేనే ఉద్యోగం ఉంటుంది లేదంటే ఊస్టే. ఆ పరీక్ష ఏంటో తెలుసా…గులేరు(వడిసెలు)తో గురి తప్పకుండా కొట్టాలి. ఇది మెక్సికోలోని అల్వరాడో నగరం లో జరిగింది. ఓ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు అధికారులు యథావిధిగా ఉదయం విధులకు హాజరయ్యారు. వచ్చిన అధికారులందరి దగ్గరి నుంచి తుపాకులు, ఆయుధాలు తీసేసుకున్నారు. ఆ తర్వాత వారి చేతికి గులేరు తో పాటు కొన్ని రాళ్లు ఇచ్చారు. దాంతో చెప్పిన లక్ష్యాన్ని గురి చూసి కొట్టాలని సూచించారు ఉన్నతాధికారులు.

ఈ పరీక్షలో పాల్గొన్న 130 మంది అధికారుల్లో కేవలం 30 మంది పాసయ్యారట. మిగిలిన వారు సర్వీసుకు పనికిరారని సర్టిఫికెట్‌ ఇచ్చేశారట. మిగిలిన నగరాల్లోనూ ఇలాంటి పరీక్షలే పెట్టి పోలీసుల సామర్థ్యాన్ని పరీక్షిస్తామని వెరాక్రూజ్‌ రాష్ట్ర గవర్నర్‌ మిగుల్‌ ఏంజెల్‌ యూనస్‌ తెలిపారు. ఇప్పుడు ఈ చర్య అక్కడ హాట్‌ టాపిక్‌ అయింది..

ఉన్నతాధికారులతో పాటు ప్రతిపక్షాల నేతలు కూడా గవర్నర్‌పై మండిపడుతున్నారు. ఇదంతా రాజకీయంగా చేస్తున్న కుట్ర అని… ఆయుధాలను పక్కనపెట్టి ఇలాంటివి ఇవ్వడమేంటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇలా జరగడం అక్కడ తొలిసారేం కాదు. 2007లో కూడా టిజువానా నగరంలో ఆర్మీ అధికారులు పోలీసుల తుపాకులు తీసుకుని.. వడిసెలు ఇచ్చి డ్యూటీ చేయమన్నారట. వింతగా ఉంది కదూ.

 

 

Posted in Uncategorized

Latest Updates