గుహలో సేఫ్ గా : తప్పిపోయిన పుట్ బాల్ టీమ్ ఆచూకీ లభ్యం

FOOT9 రోజుల క్రితం తప్పిపోయిన థాయ్ యూత్ పుట్ బాల్ టీమ్ ఆచూకీ లభించింది. తప్పిపోయిన 13 మంది సేఫ్ గా ఉన్నట్లు థాయ్ నేవీ సీల్స్… అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు. వారంతా బ్రతికే ఉన్నారన్న సమాచారంతో వారి కుటుంబసభ్యలు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నెల 23న నార్త్ థాయిలాండ్ లోని రాయ్‌ ప్రొవిన్స్‌ లో యూత్ పుట్ బాల్ టీమ్…ప్రాక్టీస్‌ ముగిసిన తర్వాత  దగ్గర్లో ఉన్న లూవాంగ్‌ గుహ సందర్శనకు వెళ్లారు. సాధారణంగా వానాకాంలో ఎవ్వరినీ ఆ గుహలోనికి అనుమతించరు. అయితే వర్షాలు తక్కువగా ఉన్నయన్న అభిప్రాయంతో యూత్ పుట్ బాల్ టీమ్ సభ్యులు గుహ లోపలికి వెళ్లారు. అయితే వారు గుహలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే భారీ వర్షం పడటం…గుహ అంతా నీటితో మునిగిపోవడంతో వారు గుహలోనే చిక్కుకుపోయారు. అయితే ఎంతసేపటికీ వారు ఇంటికి తిరిగిరాకపోవడంతో వారి తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. గుహ బయట సైకిళ్లను గుర్తించిన అధికారులు… వారి కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. సోమవారం(జూలై 2న) వారిని కనుగొన్నట్లు రెస్క్యూ టీమ్ ప్రకటించింది. రెస్క్యూ టీమ్ ని చూడగానే వారంతా సంతోషం వ్యక్తం చేశారు. తినడానికి ఏమైనా ఉన్నాయా, వెంటనే బయటకు తీసుకెళ్లాలని, వాళ్లను కోరారు. రెస్క్యూ టీమ్ వారిని చేరుకున్న వీడియోను థాయ్ నేవీ సీల్స్  అధికారిక ఫేస్ బుక్పేజీలో షేర్ చేశారు. తమ పిల్లలు బ్రతికే ఉన్నారన్న సమాచారం అందటంతో చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కస్టపడి తమ బిడ్డలను కాపాడినందుకు రెస్క్యూ టీమ్ కు కృతజ్ణతలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates