గూగుల్‌కు పోటీగా పేటీఎం మినీ యాప్‌ స్టోర్‌‌

కంపెనీ యాప్‌‌లోనే అందుబాటులోకి

న్యూఢిల్లీ: ఇండియాలో గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌‌‌కు పోటీగా ఓ మినీ యాప్‌‌ స్టోర్‌‌‌‌ను డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ కంపెనీ పేటీఎం సోమవారం లాంఛ్‌‌ చేసింది. ఇండియన్ డెవలపర్లకు సాయపడేందుకు ఈ యాప్‌‌ స్టోర్‌‌‌‌ ఉపయోగపడుతుందని పేటీఎం పేర్కొంది. కాగా, ప్లే స్టోర్‌‌‌‌ రూల్స్‌‌ను ఫాలో కాలేదనే కారణంతో గత నెల 18 న  పేటీఎం యాప్‌‌ను ప్లే స్టోర్‌‌‌‌ నుంచి గూగుల్ తొలగించింది. ప్రస్తుతం యాప్‌‌ స్టోర్‌‌‌‌ సెగ్మెంట్‌‌లో  గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌‌‌  లీడర్‌‌‌‌గా ఉంది.   ఏదైనా యాప్‌‌లో అదనంగా బోనస్‌‌ లెవెల్స్‌‌, వర్చువల్‌‌ మనీ వంటివి(యాప్‌‌ బిల్లింగ్‌‌ సిస్టమ్‌‌) కస్టమర్‌‌‌‌  కొనుగోలు చేస్తే , కస్టమర్‌‌‌‌ చెల్లించిన అమౌంట్‌‌లో 30 శాతాన్ని గూగుల్‌‌కు కమీషన్‌‌గా కట్టాల్సి ఉంటుంది. మిగిలిన అమౌంట్‌‌ మాత్రమే యాప్‌‌ డెవలపర్లకు చేరుతుంది. ఇలాంటి రూల్స్ ఉండడంతో గూగుల్‌‌ ప్లే స్టోర్‌‌‌‌పై కొన్ని స్టార్టప్‌‌ కంపెనీలు వ్యతిరేకతను ప్రకటిస్తున్నాయి.

జాయిన్‌‌ అయిన 300 యాప్‌‌లు..

ఈ మినీ యాప్‌‌ స్టోర్‌‌‌‌  ద్వారా కంపెనీలు తమ యాప్స్‌‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి వీలుంటుందని పేటీఎం తెలిపింది. పేటీఎం యాప్‌‌లోనే ఈ యాప్స్‌‌ అందుబాటులో ఉంటాయి. వీటి లిస్టింగ్‌‌, డిస్ట్రిబ్యూషన్‌‌ను వంటి ఫెసిలిటీస్‌‌ను పేటీఎం అందిస్తోంది. కాగా, ఇప్పటికే ఫోన్‌‌పే ఇటువంటి ఫీచర్‌‌‌‌ను తీసుకొచ్చింది.  2018 లో తమ యాప్‌‌లోనే కొన్ని ఇతర యాప్‌‌లను అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్‌‌‌‌లో ఈ ఫీచర్‌‌‌‌ను ఫోన్‌‌పే స్విచ్‌‌గా మార్చింది. ఇప్పటికే 300 కు పైగా యాప్‌‌లు తమ  స్టోర్‌‌‌‌లో లిస్టింగ్‌‌ అయ్యాయని పేటీఎం పేర్కొంది. డెకాత్లన్‌‌, ఓలా, ర్యాపిడో, నెట్‌‌మెడ్స్‌‌, 1ఎంజీ, డొమినోస్‌‌ పిజ్జా, ఫ్రెష్‌‌మెనూ, నోబ్రోకర్‌‌‌‌ వంటి యాప్స్​ ఉన్నాయి.

Latest Updates