గూగుల్ ఆ ఆప్షన్ ను తొలగించింది

google1గూగుల్ ఓపెన్ చేసి తమకు నచ్చిన ఫోటోలను  సేవ్ చేసుకోవచ్చు. అంతే కాదు వాటిని నచ్చిన వారికి పంపుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకుండా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇకపై నచ్చిన ఫోటోలను సేవ్ చేసుకోకుండా సెర్చింజన్ లో మార్పలు చేసింది గుగుల్ సెర్చింజన్. ఇంటర్నెట్ యూజర్లు ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా ‘వ్యూ ఇమేజ్‌’ బటన్‌ను తొలగించేసింది.

ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్‌ చేసినప్పుడు పక్కన విజిట్‌, షేర్‌లతోపాటు వ్యూ ఇమేజ్‌ ఆప్షన్‌ కూడా కనిపించేది. దానిని క్లిక్‌ చేస్తే ఆ ఫోటో ఓపెన్‌ అయ్యి సేవ్‌ చేసుకునే అవకాశం ఉండేది. అయితే కాపీ రైట్స్‌ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్‌ను గూగుల్‌ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్‌ లో కేవలం విజిట్‌, షేర్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఇవాళ్టి (ఫిబ్రవరి-16) నుంచే కొన్ని మార్పులు చేసింది గూగుల్ సెర్చింజన్. వ్యూ ఇమేజ్‌ బటన్‌ను తొలగించేశామని.. యూజర్లకు, ఆధారిత వెబ్‌సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేనిట్లలు తెలిపింది. దీని ద్వారా విజిట్‌ పేజ్‌ బటన్‌ ద్వారా ఆధారిత వెబ్‌ సైట్‌కు యూజర్‌ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్‌ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది. హై డెఫినేషన్‌ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్‌ చెబుతుండగా.. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు.

Posted in Uncategorized

Latest Updates