గూగుల్ ఇస్తోంది : బహిరంగ ప్రదేశాల్లో వై-పై సర్వీసులు

WIFIబహిరంగ ప్రదేశాల్లో వై–ఫై సర్వీసులు అందించే దిశగా టెలికం ఆపరేటర్లు సహా ఇతరత్రా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది గూగుల్‌. భారత్‌లో కొన్ని రైల్వే స్టేషన్స్‌లో వై–ఫై సేవలు ప్రారంభించిన స్ఫూర్తితో ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో కూడా ’గూగుల్‌ స్టేషన్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఆ సంస్థ భారత విభాగం డైరెక్టర్‌ కె. సూరి. రైల్‌ టెల్‌ భాగస్వామ్యంతో ప్రారంభించిన వై–ఫై సేవలతో యూజర్లు సగటున 300 ఎంబీ మేర డేటాను వినియోగించుకుంటున్నారని వివరించారు.

వైజాగ్, విజయవాడ, అలహాబాద్, గోరఖ్‌పూర్‌ మొద లైన స్టేషనన్లల్లో అత్యధికంగా డేటా వినియోగం ఉంటోందన్నారు సూరి. రిలయన్స్‌ జియో సర్వీసులు ప్రారంభమైనప్పటికీ డేటా వినియోగం గణనీయంగానే ఉందన్నారు. వాస్తవానికి పబ్లిక్‌ వై–ఫై సర్వీసుల వల్ల టెల్కోలపై డేటా ట్రాఫిక్‌ భారం తగ్గుతుందన్నారు ఆయన. పబ్లిక్‌ వై–ఫైతో 2019 నాటికి 4 కోట్ల మంది పైగా కొత్త యూజర్లు.. ఇంటర్నెట్‌కు చేరువ కాగలరని, జీడీపీ మరో 20 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడగలదని నివేదికలు చెబుతున్నాయన్నారు సూరి.

Posted in Uncategorized

Latest Updates