గూగుల్ కొత్త ఆఫర్: తేజ్ యాప్ తో బిల్లుల చెల్లింపు

tezzగూగుల్ తేజ్‌ యాప్‌ వినియోగదారులకు శుభవార్త. గూగుల్‌ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో ఒక మొబైల్‌ వాలెట్‌ యాప్‌ ‘తేజ్‌’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. సంస్థ ఇప్పుడు ఈ యాప్‌ను సరికొత్త ఫీచర్‌తో అప్‌డేట్‌ చేసింది.

యుటిలిటీ బిల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు తేజ్‌ యాప్‌ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్, మొబైల్‌ బిల్లులను చెల్లించొచ్చు. అది కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్‌ చార్జీలు లేకుండా. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ఆధారంగా పనిచేసే తేజ్‌ యాప్‌ ద్వారా దాదాపు 90 యుటిలిటీ సంస్థల కస్టమర్లు వారి బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని  తెలిపింది.

మా డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌కి కొత్తగా బిల్‌ పే ఫీచర్‌ను జోడించామని తెలిపింది గూగుల్. దీంతో ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్, డీటీహెచ్, ఇన్సూరెన్స్‌ ప్రీమియం సహా వివిధ రకాల బిల్లులను చెల్లించొచ్చని తెలిపింది. బిల్లు గడువు దగ్గరకు వచ్చినప్పుడు తేజ్‌ యాప్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఆ విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates